అంతా అబద్ధం.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేరళ ఆలయ ధర్మకర్త ఆగ్రహం

సీఎంపై, తనపై బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలు కేరళ ఆలయ ట్రస్టీ మాధవన్ తోసిపుచ్చారు.

Update: 2024-05-31 17:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సీఎంపై, తనపై బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలు కేరళ ఆలయ ట్రస్టీ మాధవన్ తోసిపుచ్చారు. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజరాజేశ్వరి ఆలయంలో అలాంటి పూజలు జరగడం లేదని ఆయన పేర్కొన్నారు. ఆలయంలో అలాంటి పూజలు జరగవని స్పష్టం చేశారు. ఆలయ ప్రాంగణాన్ని తనిఖీ చేశామని.. తాంత్రిక పూజలు చేస్తున్నట్లు ఎలాంటి ఆధారం దొరకలేదన్నారు. ఆలయ సమీపంలో మేకలు, గేదెలను బలిఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు. రాజకీయాల కోసం తమ గుడిని వివాదంలోకి లాగడంపై అసహనం వ్యక్తం చేశారు. తమ ఆలయంలో తాంత్రిక పూజలు జరగవని.. కేవలం బ్రాహ్మణ పూజలే జరుగుతాయని స్పష్టం చేశారు.


Similar News