నార్త్ ఇండియాలో తీవ్ర వేడిగాలులు..రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వేడిగాలులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పరిస్థితి మరో నాలుగు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది.

Update: 2024-05-19 04:43 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వేడిగాలులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పరిస్థితి మరో నాలుగు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ నేపథ్యంలో హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ రాజస్థాన్‌లకు రెడ్ అలర్ట్, ఉత్తర ప్రదేశ్, తూర్పు రాజస్థాన్‌లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో సుమారు 20 చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఢిల్లీలోని ముంగేష్‌పూర్‌లో అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్, నజఫ్‌గఢ్‌లో 46.7 డిగ్రీలుగా నమోదైంది. మరో నాలుగు రోజుల పాటు వేడి గాలులు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Tags:    

Similar News