మొట్టమొదటి సారిగా ఆ రాష్ట్ర మామిడి పండ్లు ఆమెరికాకు..!

దిశ, వెబ్ డెస్క్: మొట్టమొదటి సారిగా గిరిజనులు పండించిన మామిడి పండ్లు అమెరికాకు ఎగుమతి అయ్యాయి..latest telugu news

Update: 2022-06-06 11:36 GMT

దిశ, వెబ్ డెస్క్: మొట్టమొదటి సారిగా గిరిజనులు పండించిన మామిడి పండ్లు అమెరికాకు ఎగుమతి అయ్యాయి. దీంతో గిరిజన రైతులకు భారీగానే ఆదాయం చేకూరినట్లు తెలుస్తోంది. ఈ మామిడి పండ్లు మహారాష్ట్రలోని నాసిక్ నుంచి మొదటిసారిగా అమెరికాకు ఎగుమతి చేశారు. గిరిజన రైతులు ఈ పండ్లను సేంద్రియ పద్దతి ద్వారా పండించారు. దీంతో ఆ రైతులకు స్థానిక మార్కెట్‌లలో సంపాదించే దానిలో 200 శాతానికి పైగా సంపాదించడానికి వీలు కలిగిందని ఒక అధికారి తెలిపారు. సుమారు 1.2 టన్నుల సరుకును నాసిక్‌లోని తొమ్మిది తాలూకాల గిరిజన రైతుల నుండి సేకరించినట్లు నివేదికలు తెలిపాయి.


Similar News