పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రతి అంగుళం భారత్‌కే చెందుతుంది: అమిత్ షా

పీఓకేలోని ప్రతి అంగుళం భారత్‌కే చెందుతుందని, దాన్ని ఎలాంటి శక్తీ లాక్కోలేదని స్పష్టం చేశారు.

Update: 2024-05-10 13:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) విషయంలో కాగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘాటుగా బదులిచ్చారు. పీఓకేలోని ప్రతి అంగుళం భారత్‌కే చెందుతుందని, దాన్ని ఎలాంటి శక్తీ లాక్కోలేదని స్పష్టం చేశారు. శుక్రవారం జార్ఖండ్‌లోని ఖుంటిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన ఆయన.. పాకిస్తాన్ వద్ద అణుబాంబు ఉందని, దాన్ని గౌరవించాలని కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యారు చెబుతున్నారు. కొద్దొరోజుల క్రితం అదే పార్టీకి చెందిన ఫరూఖ్ అబ్దుల్లా కూడా అదే మాట చెప్పారు. పీఓకే గురించి మాట్లాడకూడదని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏమైందో తెలీదు. పీఓకే భారత్‌లో భాగమని పార్లమెంటులో ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత, ఇప్పుడు దానిపై ప్రశ్నిస్తున్నారు. అణుబాంబుల గురించి ప్రస్తావిస్తున్నారు. నేను వారికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. పీఓకే భారత్‌కు మాత్రమే చెందిందని ఇండియా కూటమి, కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాలన్నారు. ఇదే సమయంలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని, జార్ఖండ్‌లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి అవినీతిలో మునిగిపోయిందని అమిత్ షా ఆరోపణలు చేశారు. వారి కూటమి భూ కుంభకోణం, ఉపాధి హామీ స్కామ్, మద్యం కుంభకోణంలో మునిగిపోయిందని విమర్శించారు. 

Tags:    

Similar News