Budget 2024: అభివృద్ది చెందిన దేశానికి పునాది వేస్తుంది
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్(FM Nirmala Sitharaman ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) స్పందించారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్(FM Nirmala Sitharaman ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) స్పందించారు. ఈ బడ్జెట్ సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని, అభివృద్ధి చెందిన భారతదేశానికి పునాది వేస్తుందన్నారు. పన్ను భారాన్ని తగ్గించడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని అన్నారు.మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేశామన్నారు. చిరు వ్యాపారులు, ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి కొత్త బాటలు వేశామని పేర్కొన్నారు. మౌలిక, తయారీ రంగాలను బలోపేతం చేసేలా ఈ బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి ఈ బడ్జెట్ సాయం చేస్తుందన్నారు. ఉద్యోగ కల్పన, స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఎంప్లాయిమెంట్ లింక్‌డ్ స్కీమ్ ద్వారా కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. కొత్త ఉద్యోగులకు తొలి జీతం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందన్నారు. కోటి మందికి ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తున్నామని.. ఇంటర్న్‌షిప్ ద్వారా గ్రామీణులకూ పెద్ద కంపెనీల్లో పనిచేసే అవకాశం ఉంటుందన్నారు.
మహిళా కేంద్రీకృతం
ఈ బడ్జెట్ మహిళా కేంద్రీకృతమైనదన్నారు. మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి, శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యానికి దోహదపడుతుందన్నారు. రానున్న కొద్ది సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేలా ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందన్నారు. కొత్త పన్ను విధానంలో మార్పులు తీసుకురావడం వల్ల పన్ను భారాన్ని తగ్గించామన్నారు. తూర్పు భారత్ సర్వతోముఖాభివృద్ధఇకి ప్రభుత్వ పథకాలను తీసుకొచ్చామన్నారు.
యువత కోసం
బడ్జెట్‌లో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేశామని ప్రధాని మోడీ అన్నారు. యువతకు ఉపాధఇ కల్పించే బడ్జెట్ ఇదన్న మోడీ.. గ్రామం నుంచి మహా నగరం వరకూ అందర్నీ వ్యాపారవేత్తలను చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ముద్రా రుణాల పరిధిని రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు పెంచామన్నారు. భారత్‌ను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చుతున్నామన్నారు. ఎంఎస్‌ఎంఈలకు రుణాలు అందించేందుకు కొత్త పథకం తీసుకొస్తున్నామని పేర్కొన్నారు.