సిమ్రాన్ వచ్చేయ్ ఓటేద్దాం! ఎన్నికల సంఘం కూడా మీమ్స్ స్టార్ట్ చేసింది బయ్యా!

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికలు 7 దశల్లో జరగనున్న విషయం తెలిసిందే.

Update: 2024-04-14 13:37 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికలు 7 దశల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తుంది. మొదటి దశ ఏప్రిల్ 19న 21 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండటంతో భారత ఎన్నికల సంఘం ఓటర్ల అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. మరోవైపు సోషల్ మీడియాలో ఎన్నికల సంఘం చురుకుగా ఉంటుంది. ఈ క్రమంలోనే నెటిజన్లకు సైతం ఓటు పై అవగాహన కల్పించేలా మీమ్స్ ఉపయోగిస్తుంది.

ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా ప్రముఖ బాలీవుడ్ నటుడి సూపర్ హిట్ సినిమా అయిన ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ ట్రైన్‌కు సంబంధించిన సీన్ ఫోటోను ఎన్నికల సంఘం పోస్ట్ చేసింది. ‘జల్దీ రా సిమ్రాన్. ఓటు వేయడానికి ఇంటికి పోవాలి’ అని ట్వీట్ చేసింది. ఈ మీమ్ నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు సైతం తీవ్రస్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. ఓటు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము.. కానీ ఆ రైలు బోగీల్లో ఎక్కడానికి చోటు లేదని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు స్పెషల్ ట్రైన్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? అని మరికొంత మంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News