ఎస్పీ ఎమ్మెల్యే ఇంటిపై ఈడీ దాడులు: ముంబై, కాన్పూర్‌లలో తనిఖీలు

ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకి, ఆయన బంధువుల ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం దాడులు చేపట్టింది. యూపీలోని కాన్పూర్, మహారాష్ట్రలోని ముంబై సహా సుమారు 8 స్థానాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది.

Update: 2024-03-07 05:48 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకి, ఆయన బంధువుల ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం దాడులు చేపట్టింది. యూపీలోని కాన్పూర్, మహారాష్ట్రలోని ముంబై సహా సుమారు 8 స్థానాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. భూకబ్జా, నకిలీ ఆధార్ కార్డ్ కేసులు మొదలైన అనేక ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా దాడులు నిర్వహించినట్టు సమాచారం. సోలంకిపై ఇప్పటి వరకు 17 కేసులు నమోదు చేశారు. అంతేగాక భన్నపూర్వాలో ఇర్ఫాన్ సహచరుడుగా ఉన్న బిల్డర్ హాజీ వాసీ ఇంటిపైనా అధికారులు సోదాలు చేశారు. బినామీ ఆస్తులపై సమాచారం సేకరిస్తున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, సిసామావు ​​అసెంబ్లీ స్థానం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సోలంకి.. తనప్లాట్‌ను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారని ఓ మహిళ గతంలో ఆరోపించగా..ఈ కేసులో ఏడాది కాలంగా ఆయన మహారాజ్‌గంజ్ జైలులో ఉన్నారు. ఇర్ఫాన్, అతని సోదరుడు అర్షద్‌లకు కాన్పూర్‌లో దాదాపు రూ.200 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ఈడీ అనుమానిస్తోంది. మరోవైపు ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి సోలంకి దరఖాస్తు చేసుకోగా.. అందుకు కోర్టు నిరాకరించింది. 

Tags:    

Similar News