Money Laundering ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌పై ఈడీ చార్జిషీట్

ఢిల్లీ వక్ఫ్ బోర్డ్(Delhi Waqf Board) మనీ లాండరింగ్ కేసు(Money Laundering Case)లో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌(AAP MLA Amanatullah Khan)పై మంగళవారం ఈడీ చార్జిషీట్(ED Chargesheet) దాఖలు చేసింది.

Update: 2024-10-29 13:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ వక్ఫ్ బోర్డ్(Delhi Waqf Board) మనీ లాండరింగ్ కేసు(Money Laundering Case)లో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌(AAP MLA Amanatullah Khan)పై మంగళవారం ఈడీ చార్జిషీట్(ED Chargesheet) దాఖలు చేసింది. 110 పేజీల ఈ సప్లిమెంటరీ చార్జిషీటులో అమానతుల్లాతోపాటు మరియం సిద్ధిఖీ పేరును కూడా పేర్కొంది. సిద్ధిఖీని ఇంకా అరెస్టు చేయలేదు. ఈ కేసును నవంబర్ 4వ తేదీన కోర్టు విచారణకు స్వీకరించే అవకాశమున్నది.

సెప్టెంబర్ 2వ తేదీన అమానతుల్లా ఖాన్‌ను అరెస్టు చేసిన ఈడీ.. ఆ తర్వాత జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అమానతుల్లా ఖాన్ ఢిల్లీ వక్ఫ్‌ బోర్డ్ చైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడు అక్రమంగా తన అనుకూలురులను నియమించుకున్నాడని, వారి నుంచి సేకరించిన డబ్బులతో తన అనుచరుల పేరుమీద స్థిరాస్తులు కొన్నాడని ఈడీ ఆరోపిస్తున్నది. అమానతుల్లా ఖాన్ అనుచరులుగా భావిస్తున్న దౌద్ నాసిర్, జీషన్ హైదర్, జావెద్ ఇమామ్ సిద్ధిఖీ, కౌసర్ ఇమామ్ సిద్ధిఖీలపైనా జనవరిలోనే ఈడీ చార్జిషీట్ ఫైల్ అయింది. 2018-2022 కాలంలో చైర్మన్‌గా అమానతుల్లా ఖాన్ ఉన్నప్పుడు వక్ఫ్ బోర్డ్ ఆస్తులను లీజుకు ఇచ్చి కూడా వ్యక్తిగతంగా లబ్ది పొందాడని ఈడీ ఆరోపిస్తున్నది. ఖాన్ పై నమోదైన పలు ఎఫ్ఐఆర్‌ల ఆధారంగా మనీలాండరింగ్ కింద దర్యాప్తు చేస్తున్నట్టు ఢిల్లీ హైకోర్టుకు ఈడీ అక్టోబర్ 18వ తేదీన తెలియజేసింది.

Tags:    

Similar News