ఆ ఆరు జిల్లాల్లో ఇంటింటి సర్వే నిలిపేయండి

పశ్చిమ బెంగాల్‌లో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను ఆరు జిల్లాల్లో నిలిపేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

Update: 2024-10-22 14:03 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను ఆరు జిల్లాల్లో నిలిపేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. బెంగాల్‌లో ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నియోజకవర్గాలున్న జిల్లాల్లో ఇంటింటి సర్వేను నిలిపేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. సీతయ్, మదారిహట్, నైహాతి, హరోవా, మేదినీపూర్, తలదంగ్రా అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికలు ముగిసేవరకు నిలిపేయాలని పేర్కొంది. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటనతోనే కోడ్ అమల్లోకి వస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేసింది. రూరల్ హౌజింగ్ స్కీమ్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నది.

Tags:    

Similar News