DRDO-Army: భారత రక్షణలో మరో ముందడుగు.. యాంటీ ట్యాంక్ క్షిపణి ప్రయోగం సక్సెస్

డీఆర్‌డీవో- ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా కలిసి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన యాంటీ ట్యాంక్ క్షిపణి వ్యవస్థ ప్రయోగం విజయవంతం అయింది

Update: 2024-08-13 11:49 GMT

దిశ, నేషనల్ బ్యూరో: డీఆర్‌డీవో- ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా కలిసి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన యాంటీ ట్యాంక్ క్షిపణి వ్యవస్థ ప్రయోగం విజయవంతం అయింది. రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో ఈ పరీక్ష నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. క్షిపణి పనితీరు, వార్‌హెడ్ పనితీరు అద్భుతంగా ఉన్నాయని వారు చెప్పారు. మ్యాన్-పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ సిస్టమ్‌(ATGM)లో క్షిపణి, లాంచర్, టార్గెట్ అక్విజిషన్ సిస్టమ్, ఫైర్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి. ఇది శత్రు ట్యాంకులు, వారి వాహనాలపై పగలు, రాత్రి సమయాల్లో దాడి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. డ్యూయల్ మోడ్ సీకర్ ఫంక్షనాలిటీ ట్యాంక్ వార్‌ఫేర్ కోసం క్షిపణి సామర్థ్యాన్ని పెంచుతుందని అధికారులు తెలిపారు. ప్రయోగం విజయవంతం కావడంపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్‌డీవో-ఇండియన్ ఆర్మీని అభినందించారు. అధునాతన సాంకేతికత ఆధారిత రక్షణ వ్యవస్థ అభివృద్ధిలో స్వావలంబన సాధించడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు.

Tags:    

Similar News