భయపడకండి.. ఓట్ల లెక్కింపునకు ముందు బ్యూరోక్రాట్లకు ఖర్గే సూచన

ఓట్ల లెక్కింపునకు ముందు బ్యూరోక్రాట్లకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక సూచనలు చేశారు.

Update: 2024-06-03 18:07 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఓట్ల లెక్కింపునకు ముందు బ్యూరోక్రాట్లకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక సూచనలు చేశారు. కౌంటింగ్ కు ముందురోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా 150 మంది ఐఏఎస్ అధికారులను బెదిరించే ప్రయత్నం చేశారని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఐఏఎస్ అధికారులకు ఖర్గే పలు సూచనలు చేశారు.

బ్యూరోక్రాట్లకు ఖర్గే సూచనలివే..

ఎవరికీ బెదిరిపోవద్దని బ్యూరోక్రాట్లకు హితవు పలికారు. రాజ్యాంగ విరుద్ధమైన మార్గాలకు తలవంచవద్దని సూచించారు. నిజాయితీగా విధులు నిర్వర్తించాలని కోరారు. ఐఏఎస్ అధికారులకు రాసిన లేఖను సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. నమ్మకంగా, మనస్సాక్షిగా విధులు నిర్వహిస్తానని ప్రతి అధికారి రాజ్యాంగంపై ప్రమాణం చేస్తారని గుర్తుచేశారు. భయంతోనో లేదా ఇష్టంతోనో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. పారదర్శకంగా అధికారులు పనిచేయాలని కోరారు. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి బ్యూరోక్రాట్ తమ విధులు నిర్వర్తించాలని ఆశిస్తున్నామన్నారు. బలవంతం, ఒత్తిడి లేదా బెదిరింపులకు భయపడవద్దని సూచించారు.



Similar News