Trump: ప్రపంచం మొత్తం మోడీని ప్రేమిస్తోంది.. గెలుపు అనంతరం ట్రంప్ కీలక వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్ష ఎన్నిక(US presidential electio)ల్లో గెలుపొందిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump)కు ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) శుభాకాంక్షలు చెప్పారు.

Update: 2024-11-07 03:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నిక(US presidential electio)ల్లో గెలుపొందిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump)కు ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) శుభాకాంక్షలు చెప్పారు. ఫలితాలు వెలువడిన వెంటనే ఫోన్ చేసి విష్ చేశారు. ప్రపంచ శాంతి కోసం కలిసి పనిచేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీని ప్రేమిస్తోందని ఈ సందర్భంగా ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ అద్భుత దేశమని కితాబిచ్చారు. భారత ప్రధాని మోడీ తనకు నిజమైన స్నేహితుడు అని అన్నారు.

ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ(Republican Party) అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఘన విజయం సాధించారు. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌(Democratic Party candidate Kamala Harris)పై భారీ విజయాన్ని సాధించి రెండోసారి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. హోరాహోరీగా అనుకున్న పోరులో ఏకపక్ష విజయం సాధించి అందరి అంచనాలను తలకిందులు చేశారు. గెలుపోటములను నిర్ణయించే స్వింగ్‌ స్టేట్స్‌ను ట్రంప్‌ స్వీప్‌ చేశారు.

Tags:    

Similar News