US Elections 2024: వన్స్ ఎగైన్ ప్రెసిడెంట్ ట్రంప్.. ఎన్నికల్లో బంపర్ విక్టరీ
యునైటెడ్ స్టేట్స్ (US Elections 2024) ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బంపర్ విక్టరీ సాధించారు.
దిశ, వెబ్‌డెస్క్: యునైటెడ్ స్టేట్స్ (US Elections 2024) ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బంపర్ విక్టరీ సాధించారు. రిపబ్లికన్ పార్టీ తరపున బరిలో నిలిచిన ట్రంప్.. డెమోక్రాట్ల (Democratic Party) అభ్యర్థి కమలా హ్యారిస్ (Kamala Harris)ను ఓడించి రెండోసారి ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్ల (Electoral Votes)లో మ్యాజిక్ ఫిగర్ 270ని దాటి 277 ఎలక్టోరల్ ఓట్లతో గెలుపు జెండా ఎగరేశారు. ఇక కమలా హ్యారిస్ ఇప్పటికీ 226 ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే దక్కడంతో ఆమె ఈ పోటీలో ఓడినట్లైంది. ఇదిలా ఉంటే ఎన్నికల్లో ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికన్లకు ఇప్పటివరకు 8 లక్షల వరకు ఓట్లు రాగా.. కమలా హ్యారిస్ (Kamala Harris) పార్టీ అయిన డెమోక్రాట్లకు 7 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి.
ఇదిలా ఉంటే 2014లో అమెరికా దేశాధ్యక్షుడిగా తొలిసారి ఎన్నికైన ట్రంప్ 2019 వరకు ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 2019లో జో బైడెన్ (Joe Biden) చేతిలో ఓటమి పాలవడంతో ప్రెసిడెంట్ పదవి పోయింది. ఇక ఈ దఫా ఎన్నికలకు ముందు రిపబ్లికన్ పార్టీ (Republican Party) ఆయనకు బదులుగా మరో వ్యక్తిని ప్రెసిడెంట్ క్యాండిడేట్‌గా ఎంపిక చేయబోతోందనే వార్తలు రావడంతో ట్రంప్ ఇక రెండో సారి ప్రెసిండెట్ కాలేడని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా రిపబ్లికన్లు కొత్త లీడర్ విషయంలో వెనక్కి తగ్గడంతో ట్రంప్‌కు లైన్ క్లియర్ అయింది. దీంతో ఫుల్ జోష్‌లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ఎన్నికల్లో అద్భుత విజయం దక్కించుకున్నారు. ముఖ్యంగా స్వింగ్ స్టేట్స్ అయిన పెన్సిల్వేనియా, జార్జియా, నార్త్ కరోలినాల్లో సూపర్ విక్టరీ సాధించడమే కాకుండా అరిజోనా, నెవాడా, మిషిగన్, విస్కోన్సిన్‌లలో ఇంకా ఓట్ల లెక్కింపులో కూడా రిపబ్లిక్ పార్టీ ఫుల్ లీడ్‌లో దూసుకుపోతోంది.
కాగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ విజయం వైపు దూసుకెళుతున్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. అమెరికా ప్రజలు గొప్ప విజయాన్ని అందించారని, అమెరికా ప్రజల కోసం పనిచేస్తానని, అమెరికాకు స్వర్ణయుగం తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు పవర్‌ఫుల్ తీర్పు ఇవ్వడంతో ఎవరూ ఊహించని విజయాన్ని అందుకున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి క్షణం తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని, అమెరికా ప్రజల కష్టాలు తీరబోతున్నాయని, ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తానని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా స్వింగ్ స్టేట్లలో విజయం ఆనందం కలిగించిందని, మొత్తంగా 315కు పైగా ఎలక్టోరల్ ఓట్లు రిపబ్లికన్ పార్టీకి వస్తాయని ట్రంప్ అనడం కొసమెరుపు.
Read More..
Donald Trump: ట్రంప్ కు శుభాకాంక్షలు తెలిపిన భారత్, ఇజ్రాయెల్ ప్రధానులు