ఒకే దేశం, విభిన్న జీవితాలు! : స్మితా సబర్వాల్ ఆసక్తికర ట్వీట్

తెలంగాణ సీఎంఓ కార్యదర్శి, ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ మరోసారి ఆసక్తికర ట్వీట్ చేశారు.

Update: 2023-05-27 05:48 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ సీఎంఓ కార్యదర్శి, ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ మరోసారి ఆసక్తికర ట్వీట్ చేశారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని ప్రజలు తాగునీరు కోసం పడుతున్న ఇబ్బందులకు సంబంధించిన ఓ ట్వీట్‌ను ఆమె రీట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ప్రజలు తాగునీరు కోసం ఎంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఒకే దేశం, విభిన్న జీవితాలు. ఎంత విచారకమైన విధి ’అని స్మిత సబర్వాల్ పేర్కొన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం నిరూపించిందని, మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటింటికి మంచి నీటి సరఫరా చేస్తుందన్నారు.

ఒక దృఢమైన ఇంజనీరింగ్ అనేది ప్రకృతి వైపరీత్యాన్ని మార్చగలదని, దానికి ఉదాహరణగా స్వచ్ఛమైన తాగునీటిని అందించడంలో తెలంగాణ ప్రభుత్వం దాదాపు కోటి ఇళ్ల గుమ్మం వద్దకు చేర్చిందని అన్నారు. ఈ సందర్భంగా స్మితా సబర్వాల్ గతంలో పనిచేసిన జిల్లాలో ఏ విధంగా నీటి కోసం ఇబ్బందులు పడ్డారు…ఇప్పుడు ఆ జిల్లా ఆ రాష్ట్రము ఎంతగా అభివృద్ధి చెందింది అన్నది వివరించారు. కరీంనగర్ జిల్లాలో 10 సంవత్సరాల క్రితం నీటి కోసం రోడ్లపైన ధర్నాచేసే పరిస్థితి, కానీ ఇప్పుడు చూస్తే తెలంగాణ ప్రభుత్వం కోటి ఇళ్లకు పైగానే స్వచ్ఛమైన తాగు నీటిని అందిస్తోంది. కానీ ఇప్పుడు మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాను తీసుకుంటే అక్కడ ప్రజలు ఇంకా నీటి కోసం బావులలో ప్రమాదకరమైన పరిస్థితిలో నీటిని తీసుకుంటున్నారని స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News