Abortion Pills: అమెరికాలో అబార్షన్ పిల్స్ కు పెరిగిన గిరాకీ

అమెరికా (USA) అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) త్వరలోనే బాధ్యలు చేపట్టనున్నారు. ట్రంప్ అధికారంలోకి వస్తే అబార్షన్ హక్కును (Abortion rights) నిషేధిస్తారంటూ వదంతులు వచ్చాయి.

Update: 2024-11-12 09:10 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా (USA) అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) త్వరలోనే బాధ్యలు చేపట్టనున్నారు. ట్రంప్ అధికారంలోకి వస్తే అబార్షన్ హక్కును (Abortion rights) నిషేధిస్తారంటూ వదంతులు వచ్చాయి. దీంతో, అబార్షన్ పిల్స్ కొనుగోళ్లు భారీగా పెరిగినట్లు స్థానిక మీడియాలో వార్తలొస్తున్నాయి. అబార్షన్‌ మాత్రల (Abortion Pills) కోసం భారీగా డిమాండ్ పెరిగింది. 24 గంటల్లోనే అబార్షన్‌ మాత్రల కోసం 10 వేలకు పైగా అభ్యర్థనలు వచ్చాయి. ఇది రోజూ ఉండే డిమాండ్‌ కంటే 17 రెట్లు ఎక్కువని కథనాలు పేర్కొన్నాయి. గర్భిణులు కానివారు కూడా ప్రిస్కిప్షన్‌ కోసం ముందస్తుగా సంప్రదిస్తున్నారని ఓ ఎన్జీవో వెల్లడించింది. తమకు వచ్చిన 125 ఆర్డర్లలో 22 మంది గర్భిణులు కానివారేనని తెలిపింది.

అబార్షన్ హక్కుపై వదంతలు

ఎన్నికలకు ముందు అబార్షన్ పిల్స్ ఎక్కడ దొరుకుతాయి అన్న సమాచారం కోసం నిత్యం 4000 నుంచి 4,500 వరకు తమ వెబ్‌సైట్‌ చూసేవారని, ఎన్నికల రిజల్ట్స్ వచ్చా ఆ సంఖ్య పెరిగిందని మరో స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఇప్పుడు ఒక్క రోజులోనే 82 వేల మందికి పైగా వెబ్‌సైట్‌ను చూస్తున్నారని, దీంతోపాటు గర్భ నిరోధక పరికరాలు, వేసక్టమీ శస్త్రచికిత్సలను తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అబార్షన్‌ హక్కుపై నిషేధం విధిస్తారనే ఆందోళనతో చాలామంది మాత్రలు నిల్వ చేసుకున్నట్లు నేషనల్‌ అబార్షన్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు బ్రిటనీ ఫోంటెనో అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇలా అబార్షన్‌ మాత్రలను నిల్వ చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2022 మే నెలలో అబార్షన్లకు వ్యతిరేకంగా చట్టం తీసుకురానున్నట్లు ప్రచారం జరిగింది. ఆ సమయంలోనూ వీటి గిరాకీ 10 రెట్లు పెరిగింది.

Tags:    

Similar News