జైలు నుంచి వచ్చాడు.. నామినేషన్ వేశాడు.. వెళ్లాడు

ఢిల్లీ అల్లర్ల కేసులో కీలక నిందితుడిగా ఉన్న తాహిర్ హుస్సేన్‌కు ఏఐఎంఎంఐ పార్టీ ముస్తాఫాబాద్ టికెట్ కేటాయించింది.

Update: 2025-01-16 14:37 GMT
జైలు నుంచి వచ్చాడు.. నామినేషన్ వేశాడు.. వెళ్లాడు
  • whatsapp icon

- దిశ, నేషనల్ బ్యూరో:

నేరస్థులకు టికెట్లు ఇవ్వడంలో అన్ని పార్టీలదీ ఒకటే తీరు. తీవ్రమైన నేరారోపణలు ఉన్నా సరే, గెలుస్తాడనే నమ్మకం ఉంటే రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలోకి దింపుతున్నాయి. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక నేరస్థుడికి మజ్లిస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఢిల్లీ అల్లర్ల కేసులో కీలక నిందితుడిగా ఉన్న తాహిర్ హుస్సేన్‌కు ఏఐఎంఎంఐ పార్టీ ముస్తాఫాబాద్ టికెట్ కేటాయించింది. ఆయన తీహార్ జైలులో ఉండటంతో కస్టడీ పెరోల్‌ మీద గురువారం ఉదయం 9.15 గంటలకు బయటకు వచ్చారు. నామినేషన్లు దాఖలు చేసిన తర్వాత మధ్యాహ్నం 2.16 గంటలకు తిరిగి జైలుకు వెళ్లిపోయారు. కాగా, తాహిర్ హుస్సేన్‌కు ఢిల్లీ పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తాహిర్ గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున కౌన్సిలర్‌గా పని చేశారు. ఆ తర్వాత ఆయన మజ్లిస్ పార్టీలో చేరారు. 2020 ఫిబ్రవరి 24న ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో 53 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Tags:    

Similar News