ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీస్ ఎదుట ఆప్ మంత్రుల నిరసన

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఇంటి ఎదుట ఢిల్లీ మంత్రులు నిసరన వ్యక్తం చేశారు.

Update: 2023-05-19 13:38 GMT
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీస్ ఎదుట ఆప్ మంత్రుల నిరసన
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నివాసం ముందు ఢిల్లీ మంత్రులు నిసరన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆప్ మంత్రి ఆతిషీ మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం పంపించిన పలు ఫైళ్లను లెఫ్టినెంట్ గవర్నర్ తొక్కిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలచే ఎన్నకోబడ్డ ప్రభుత్వ నిర్ణయాలను లెఫ్టినెంట్ గవర్నర్ అంగీకరించాలని స్వయంగా సుప్రీంకోర్టే చెప్పిందని గుర్తు చేశారు. అధికారుల ట్రాన్స్ ఫర్ విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ కు ఎలాంటి అధికారాలు లేవని సుప్రీంకోర్టు చెప్పిందని అన్నారు. ఇప్పటికైనా లెఫ్టినెంట్ గవర్నర్ ప్రజాస్వామ్యాన్ని గౌరవించి తమతో కలుస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. 

Tags:    

Similar News