మళ్లీ తెరపైకి ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. కవిత పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా
కొన్నాళ్లుగా వినిపించని ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు మరోసారి తెరపైకి వచ్చింది.
దిశ, వెబ్‌డెస్క్: కొన్నాళ్లుగా వినిపించని ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు మరోసారి తెరపైకి వచ్చింది. కేసులో తనకు ఈడీ ఇచ్చిన నోటీసులు రద్దు చేయాలని కోరుతూ.. కల్వకుంట్ల కవిత ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, విచారణలో అధికారులు సీఆర్పీసీ నిబంధనలు పాటించడం లేదని కవిత తెలిపారు. ఈడీ ఆఫీసులో మహిళను విచారించడం సరికాదని కవిత సుప్రీం కోర్టును పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా కేసుకు సంబంధించి ఈడీ తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్‌లో పేర్కొ్న్నారు. ఈ మేరకు ఇవాళ, కవిత పిటిషన్‌పై ఇవాళ జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ విచారణ చేపట్టారు. విచారణను ఈ నెల 16 వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.