BREAKING: ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ బిగ్ రిలీఫ్.. సీఎం పదవి నుంచి తొలగింపుపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలని వేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది.
దిశ, వెబ్‌డెస్క్: లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలని వేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించే అంశం కోర్టు పరిధిలోకి రాదని.. ఆ విషయం రాజకీయాలకు ముడిపడి ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈడీ కస్టడీలోకి తీసుకున్న కేజ్రీవాల్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని ఏం చట్టంలోనైనా ఉందా అని ధర్మాసనం ప్రశ్నించింది.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ తక్షణమే సీఎం పదవి నుంచి తొలగించాలంటూ సుర్జీత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. మనీ లాండరీంగ్‌కు పాల్పడిన వ్యక్తి ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు నైతిక హక్కు లేదంటూ సుర్జీత్ సింగ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో ఆయనను వెంటనే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని కోర్టుకు విన్నవించాడు.