‘వందే భారత్’ లంచ్‌లో చచ్చిన బొద్దింక.. షాకైన జంట.. రైల్వే ఏమన్నదంటే?

ప్రతిష్టాత్మక వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో దంపతులకు ఊహించని అనుభవం ఎదురైంది. రైళ్లో అందించిన ఆహారంలో చచ్చిన బొద్దింక వచ్చింది.

Update: 2024-06-20 11:36 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రతిష్టాత్మక వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో దంపతులకు ఊహించని అనుభవం ఎదురైంది. రైళ్లో అందించిన ఆహారంలో చచ్చిన బొద్దింక వచ్చింది. దీంతో వారు షాక్‌కు గురయ్యారు. దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విదిత్ వర్ష్నే నెటిజన్ తన పోస్టులో ‘ఈ నెల 18 వ తేదీన మా అంకుల్, ఆంటీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్‌లో భోపాల్ నుంచి ఆగ్రా వరకు ప్రయాణించారు. ఆ సమయంలో ఐఆర్‌సీటీసీ పెట్టిన భోజనంలో బొద్దింక వచ్చింది’ అని బొద్దింక వచ్చిన ఫుడ్ ఫోటోను పోస్ట్ పెట్టారు.

ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోండి అంటూ రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, ఐఆర్‌సీటీసీకి ట్యాగ్‌ చేశారు. తాజాగా ఈ పోస్ట్‌‌పై ఐఆర్‌సీటీసీ స్పందించింది. జరిగిన ఘటనపై క్షమాపణలు చెప్పింది. ‘మీకు కలిగిన అనుభవానికి క్షమాపణలు కోరుతున్నాము. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాం. సంబంధిత సర్వీస్‌ ప్రొవైడర్‌కు తగిన జరిమానా విధించాం’ అని పేర్కొంది.

ఈ ట్వీట్ వైరల్ కావడంతో నెటిజన్లు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రైళ్లలో అందించే ఫుడ్ క్వాలిటీపై ఎప్పుడు విమర్శలు వస్తూనే ఉంటాయి. నాసిరకం భజనం, ఫుడ్‌లో పురుగులు పడటం వంటి ఫిర్యాదులు అందుతూనే ఉంటాయి. అయితే ఎన్ని ఫిర్యాదులు వచ్చినా కూడా మార్పు మాత్రం కనిపించడం లేదని కేంద్రంపై నెటిజన్లు ఫైర్ అయ్యారు.

Tags:    

Similar News