Cyclone: ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్.. రోడ్లపై చేపలు పడుతున్న యువకులు

బంగాళఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్(Fangal Cyclone) తీరం వెంబడి రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తోంది.

Update: 2024-12-01 05:29 GMT

దిశ, వెబ్ డెస్క్: బంగాళఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్(Fangal Cyclone) తీరం వెంబడి రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తోంది. ఈదురుగాలులు, భారీ వర్షం కారణంగా ఆయా రాష్ట్రాలకు రాకపోకలు సైతం నిలిచిపోయాయి. తమిళనాడు(Tamil Nadu)లో వరదలతో రోడ్లన్ని చెరువులని తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడులోని తిరువణ్ణామలై(Thiruvannamalai) తిండివనం(Thindivanam) రోడ్లు జలమయం కావడంతో కొందరు యువకులు రోడ్లపై చేపలు(Fishes) పడుతున్నారు. వలలు, కర్రలు ఉపయోగించి వాన నీటిలో చేపల వేట(Hunting) సాగిస్తున్నారు. ఇది చూసిన స్థానికులు మరికొందరు రోడ్లపైకి వచ్చారు. దీనికి సంబంధించిన దృష్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. 

Tags:    

Similar News