సీఆర్‌పీఎఫ్ డీజీ అనీష్ దయాళ్ సింగ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్రం

కేంద్రం గురువారం నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలను అప్పగించింది.

Update: 2024-08-15 19:15 GMT
సీఆర్‌పీఎఫ్ డీజీ అనీష్ దయాళ్ సింగ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్రం
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అనీష్ దయాళ్ సింగ్‌కు కేంద్రం గురువారం నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలను అప్పగించింది. 'ఆంధ్రప్రదేశ్ నుంచి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్‌జీ) డైరెక్టర్ జనరల్ అయిన నలిన్ ప్రభాత్, ఐపీఎస్ ఇంటర్-క్యాడర్ డిప్యుటేషన్ ఫలితంగా ఏజీఎంయూటీ కేడర్‌కు బదిలీ కావడంతో.. అనిష్ దయాళ్ సింగ్ అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. మరొకరి నియామకం జరిగే వరకూ లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన ఆ పదవిలో ఉంటారని ' హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.  

Tags:    

Similar News