National Flag: జాతీయ పతాకానికి 21 సార్లు సెల్యూట్ చెయ్.. పాక్ అనుకూల నినాదాలు చేసిన వ్యక్తికి కోర్టు ఆదేశం

పాక్ అనుకూల నినాదాలు చేసిన వ్యక్తికి కోర్టు వెరైటీ ఆదేశాలు ఇచ్చింది.

Update: 2024-10-17 08:04 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పాకిస్తాన్ జిందాబాద్, హిందుస్థాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేసిన ఓ వ్యక్తికి బెయిల్ కోసం మధ్యప్రదేశ్ హైకోర్టు వెరైటీ షరతు విధించింది. నెలలో రెండు సార్లు 'భారత్ మాతాకీ జై' అని నినదిస్తూ త్రివర్ణ పతాకానికి 21 సార్లు సెల్యూడ్ చేయాలని ఆదేశించింది. భోపాల్ లో నివసిస్తున్న నిందితుడు ఫైజల్ అలియాస్ ఫైజన్ ఇటీవల పాకిస్తాన్ కు అనుకూలంగా నినాదాలు చేశాడు. దీంతో అతడిని మిస్రోడ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో అతడి బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా మధ్యప్రదేశ్ హైకోర్టు షరతులు విధించింది. నెలకు రెండు సార్లు పోలీస్ స్టేషన్ కు రావాలని.. వచ్చిన ప్రతిసారి 21 సార్లు జాతీయ జెండాకు వందనం చేయాలని షరతులు విధిస్తూ బెయిల్ మంజూరు చేసింది. విచారణ పూర్తయ్యే వరకు ఇలా జాతీయ జెండాకు వందనం చేయాల్సిందేనని బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొంది.


Similar News