Corona Cases: ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు
Corona Cases are being Increased in Delhi| దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. తాజా కేసుల్లో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించడమే కాకుండా,
న్యూఢిల్లీ: Corona Cases are being Increased in Delhi| దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. తాజా కేసుల్లో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించడమే కాకుండా, కరోనా నిబంధనలు పాటించాలని మంగళవారం మరోసారి హెచ్చరించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా కూడా ప్రజలకు సూచనలు చేశారు. 'కరోనా కేసులు స్థిరంగా పెరగడాన్ని మనం చూస్తున్నాం. మహమ్మారి ఇంకా ముగియలేదని మనం తెలుసుకోవాలి. ప్రజలందరూ కొవిడ్-19కు తగినట్లుగా నడుచుకోవాలి' అని ట్వీట్ చేశారు. ఆస్పత్రిలో చేరికలు పెరుగుతున్నాయని ప్రజా వైద్య నిపుణురాలు డాక్టర్ సునీలా గార్గ్ అన్నారు. ఇప్పటికే 500 బెడ్లు నిండిపోగా, 20 మంది ఐసీయూలో, 65 మంది వెంటిలేషన్‌పై ఉన్నారని తెలియజేశారు.
కాగా, సోమవారం 1,227 కొత్త కేసులు వెలుగుచూశాయి. అంతకుముందు వరుసగా 12 రోజుల పాటు సగటున 2వేల పైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు మరణాలు కూడా సగటున 8-10 వరకు వెలుగుచూశాయి. ఇప్పటికే ఢిల్లీలో మాస్క్ ధరించని వారికి రూ.500 జరిమానా విధిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 8,813 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 29 మరణాలు వెలుగుచూసినట్లు అధికారులు తెలిపారు. క్రితం రోజుతో పోలిస్తే రోజువారీ కేసుల నమోదు కాస్త తగ్గింది. ఇక దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,11,252 గా ఉంది.
ఇది కూడా చదవండి: కేంద్రంతో కలిసి పనిచేసేందుకు మేము సిద్ధం.. కానీ బీజేపీ దాన్ని ఒప్పుకోవాలి