Farmers Protest: పంజాబ్- హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తత.. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం

పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సరిహద్దు ప్రాంతం శంభు (Haryana-Punjab Shambhu Border) వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Update: 2024-12-14 09:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సరిహద్దు ప్రాంతం శంభు (Haryana-Punjab Shambhu Border) వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం మధ్యాహ్నం ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ ('Delhi chalo' foot march)ను ప్రారంభించిన రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ లను వాడారు. కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్ల సాధన కోసం 101 మంది రైతులు మార్చిలో(Farmers Protest) పాల్గొన్నారు. డిసెంబర్ 6 నుంచి ఢిల్లీ వైపుగా వెళ్లేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. కానీ వరుసగా మూడోసారి కూడా రైతుల ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. కాంగ్రెస్ నాయకుడు, రెజ్లర్ బజరంగ్ పునియా శంభు సరిహద్దులో రైతులతో సమావేశమయ్యారు. ‘‘ఒకవైపు రైతులను ఆపడం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతూనే మరోవైపు బాష్పవాయువు ప్రయోగిస్తోందని మండిపడ్డారు. ఢిల్లీ సరిహద్దులను పాకిస్థాన్ సరిహద్దుగా వ్యవహరిస్తోందన్నారు. ఢిల్లీ వెళ్లి నిరసన తెలిపేందుకు నేతలు కేంద్రం అనుమతి తీసుకుంటారా?" అని ప్రశ్నించారు.

హర్యానా ప్రభుత్వం ఆదేశాలు

కాగా, రైతుల మార్చ్‌ (Delhi March)ను దృష్టిలోపెట్టుకొని హర్యానా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. మొబైల్ ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేసింది. శనివారం ఉదయం ఆరు గంటల నుంచి 17వ తేదీ అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. రైతులను అడ్డుకునేందుకు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఢిల్లీ పరిపాలన అనుమతి పొందిన తర్వాతే రైతులు మార్చ్‌కు వెళ్లవచ్చని అంబాలా పోలీసులు గతంలో చెప్పారు. మరోవైపు, రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ 19 రోజులుగా ఖనౌరీ సరిహద్దులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. కేంద్రం, పంజాబ్ ప్రభుత్వ ప్రతినిధులు దల్లేవాల్ తో సమావేశం కావాలని సుప్రీంకోర్టు తెలిపింది. దల్లేవాల్ నిరాహార దీక్షను విరమించేలా ఒప్పించాలని ఆదేశించింది.

Tags:    

Similar News