'సార్ ఏడుపు ఆపండి' కాంగ్రెస్ నేతపై కేజ్రీవాల్ కౌంటర్

Update: 2022-01-17 11:41 GMT

పనాజీ: గోవాలో ఎన్నికల పోటీపై కాంగ్రెస్ నేత చిదంబరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య మాత్రమే పోరు ఉందని ట్వీట్ చేశారు. 'ఎవరైతే పరిపాలన మారాలి అనుకుంటారో వారు కాంగ్రెస్‌కు ఓటు వేస్తారు. అదే పాలన కావాలనుకునే వారు బీజేపీకి ఓటు వేస్తారు. గోవా ప్రజలు పాలన మార్పు కోసం కాంగ్రెస్ కు ఓటు వేయాలి' అని అన్నారు.

దీనిపై స్పందించిన ఆప్ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలతో ట్వీట్ చేశారు. 'సార్ ఏడుపు ఆపండి. గోవా ప్రజలు ఎక్కడ నమ్మకం ఉంటే అక్కడ ఓటు వేస్తారు. బీజేపీకి కాంగ్రెస్ అంటే నమ్మకం. ఉన్న 17 ఎమ్మెల్యేల్లో 15మంది బీజేపీలో చేరారు. ప్రతి కాంగ్రెస్ ఓటు బీజేపీకి చేరుతుంది. బీజేపీ నేరుగా కాకుండా కాంగ్రెస్ ద్వారా ఓటు వేయచ్చు' అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు పంజాబ్ ఎన్నికల్లో ఆప్ తరుఫున సీఎం అభ్యర్థిని మంగళవారం ప్రకటించనున్నారు.

Tags:    

Similar News