ఎర్రకోట వద్ద ఉద్రిక్తత.. ‘రాహుల్‌‌పై అనర్హత’కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన

Update: 2023-03-28 17:07 GMT

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాహుల్ గాంధీపై అనర్హత వేటును వ్యతిరేకిస్తూ రాత్రి 7గంటల సమయంలో కాంగ్రెస్ ఎంపీలు, సీనియర్ నేతలు ఎర్రకోట సమీపంలో సమావేశమయ్యారు. చేతిలో కాగడాలు పట్టుకుని కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఎర్రకోట నుంచి పాత ఢిల్లీ చాందిని చౌక్‌లోకి టౌన్ హాల్ వరకు శాంతియుతంగా ర్యాలీ తీసేందుకు ముందుకు కదిలారు.

అయితే, ఎర్రకోట ప్రాంగణంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయినా కూడు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య పరస్పరం తోపులాట జరిగింది. ఈ ర్యాలీలో సీనియర్ నేత మాజీ మంత్రి చిదంబరం, పార్టీ జనరల్ సెక్రెటరీ జైరాం రమేశ్, ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్‌తోపాటు పలువురు ఎంపీలు పాల్గొన్నారు. సీఎం హరీశ్ రావత్‌తోపాటు అనేక మంది ఇతర నేతలను పోలీసులు నిర్బంధించగా, ఇతరులను ఎర్రకోట నుంచి వ్యాన్‌లలో తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.

Tags:    

Similar News