నోట్లు రద్దు చేయడానికి ముఖ్య కారణం అదే: పార్లమెంట్ సాక్షిగా వెల్లడించిన కేంద్రం
భారత్‌లో నోట్ల రద్దు చేయడానికి గల కారణాన్ని కేంద్రం వెల్లడించింది.
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో నోట్లు రద్దు చేయడానికి గల కారణాన్ని కేంద్రం వెల్లడించింది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నోట్ల రద్దు చేయడానికి గల కారణాలపై కేంద్రాన్ని ప్రశ్నించారు. దేశంలో బ్లాక్ మనీకి అడ్డుకట్ట వేయడం కోసమే పెద్ద నోట్లు రద్దు చేశామని ఎంపీ ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. నోట్ల రద్దు తర్వాత నగదు నిష్పత్తి 13.7 శాతం పెరిగిందని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. దేశంలో నోట్ల రద్దు తర్వాత నగదు లావాదేవీలు పెరిగాయని తెలిపింది. ఇక, 2016 నవంబర్ 8వ తేదీన దేశంలో రూ. 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.