Mood of the Nation : హర్యానాలో కాంగ్రెస్‌దే పైచేయి.. ‘ఇండియా టుడే’ ఒపీనియన్ పోల్ నివేదిక

దిశ, నేషనల్ బ్యూరో : హర్యానాలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Update: 2024-08-22 14:10 GMT

దిశ, నేషనల్ బ్యూరో : హర్యానాలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈతరుణంలో ‘ఇండియా టుడే - మూడ్ ఆఫ్ ది నేషన్’ ఒపీనియన్ పోల్ సర్వేలో కీలక విషయాలను గుర్తించారు. ఇప్పటికిప్పుడు ఆ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు జరిగితే బీజేపీని కాంగ్రెస్ వెనక్కి నెట్టేస్తుందని సర్వేలో వెల్లడైందని ఇండియా టుడే తెలిపింది. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో పోల్స్ జరిగితే మొత్తం 10 లోక్‌సభ స్థానాల్లో 6 కాంగ్రెస్ పార్టీ గెల్చుకుంటుందని పేర్కొంది. మిగతా నాలుగు స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని తెలిపింది.

ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ దాదాపు ఇదే స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్‌లు చెరో 5 లోక్‌సభ స్థానాలు గెల్చుకున్న విషయాన్ని సర్వే సంస్థ గుర్తు చేసింది. అక్టోబరు 1న హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ పోల్స్‌లో రాష్ట్రంలో హోరాహోరీ పోరు జరుగుతుందని, కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమికి 45.8 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి 44.2 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది.

Tags:    

Similar News