హర్యానాలో హోరాహోరీ.. ఆధిక్యంలో ఇండియా కూటమి అభ్యర్థులు

ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు ఎన్డీఏ కూటమి లాండ్ స్లైడ్ విక్టరీ సాధించట్లేదు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా సహా పలు ప్రాంతాల్లో ఎన్డీఏకు ఇండియా కూటమి టఫ్ ఫైట్ ఇస్తుంది.

Update: 2024-06-04 08:43 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు ఎన్డీఏ కూటమి లాండ్ స్లైడ్ విక్టరీ సాధించట్లేదు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా సహా పలు ప్రాంతాల్లో ఎన్డీఏకు ఇండియా కూటమి టఫ్ ఫైట్ ఇస్తుంది. హర్యానాలో మొత్తం 10 లోక్ సభ స్థానాలకు కౌంటింగ్ జరగుతోంది. కాగా.. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాషాయ పార్టీ 4 స్థానాల్లో ముందంజలో ఉంది.

ఆధిక్యంలో నటుడు రాజ్ బబ్బర్

సిర్సా స్థానంలో కాంగ్రెస్ దిగ్గ‌జం కుమారి సెల్జా బీజేపీ అభ్య‌ర్ధి అశోక్ త‌న్వ‌ర్‌పై ల‌క్ష ఓట్ల‌కు పైగా మెజారిటీతో దూసుకుపోతున్నారు. న‌టుడు, కాంగ్రెస్ అభ్య‌ర్ధి రాజ్ బ‌బ్బ‌ర్ గురుగ్రాంలో 30 వేలకుపైగా ఓట్లతో ఆధిక్యంలో ముందుకు సాగుతున్నారు. రోహ్త‌క్‌లో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దీపీంద‌ర్ సింగ్ హుడా లక్ష ఓట్లకుపైగా ఆధిక్యంలో ఉన్నారు. సోనిపట్ లో కాంగ్రెస్ అభ్యర్థి సత్పాల్ బ్రహ్మచారి, హిసార్ లో కాంగ్రెస్ అభ్యర్థి జై ప్రకాశ్, అంబాలాలో కాంగ్రెస్ అభ్యర్థి వరుణ్ చౌదరి ముందంజలో ఉన్నారు.

కురుక్షేత్రలో టఫ్ ఫైట్

కాగా.. కురుక్షేత్రలో బీజేపీ అభ్యర్థి నవీన్ జిందార్, ఆప్ అభ్యర్థి డాక్టర్ సుశీల్ గుప్తా మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. తొలి రౌండ్లలో సుశీల్ గుప్తా ముందజంలో ఉండగా.. ఆ తర్వాత నవీన్ జిందాల్ పుంజుకుని ఆధిక్యంలోకి వచ్చారు. కర్నాల్ లో మాజీ సీఎం, బీజేపీ అభ్యర్థి మనోహర్ లాల్ కట్టర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఫరీదాబాద్, భివానీ మహేంద్రగఢ్ లో బీజేపీ అభ్యర్థులు క్రిషన్ పల్, ధరంబీర్ సింగ్ గెలుపు దిశగా సాగుతున్నారు.


Similar News