బిల్డింగ్ మారినా పోరాటం ఆగదు!

అదానీ-హిండెన్ బర్గ్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ తన పట్టు వీడటం లేదు. అదానీ గ్రూపు కృత్రిమ ట్రేడింగ్‌కు పాల్పడలేదని సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల క‌మిటీ స్పష్టం చేసినప్పటికీ కాంగ్రెస్ మాత్రం ఈ అంశంలో మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం ఆపడం లేదు.

Update: 2023-06-01 11:59 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అదానీ-హిండెన్ బర్గ్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ తన పట్టు వీడటం లేదు. అదానీ గ్రూపు కృత్రిమ ట్రేడింగ్‌కు పాల్పడలేదని సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల క‌మిటీ స్పష్టం చేసినప్పటికీ కాంగ్రెస్ మాత్రం ఈ అంశంలో మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం ఆపడం లేదు. తాజాగా అదానీ-హిండెన్ బర్గ్ అంశంలో 100 ప్రశ్నలతో కూడిన పుస్తకాన్ని కాంగ్రెస్ గురువారం ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ కొత్త పార్లమెంట్ భవనంలోనూ తమ పార్టీ అదానీ అంశంపైప్రశ్నిస్తుందని అన్నారు. బిల్డింగ్ మార్చినంత మాత్రానా ప్రశ్నించడం ఆపడం జరగదన్నారు. వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో జేపీసీ కోసం కాంగ్రెస్ మళ్లీ డిమాండ్ చేస్తుందని తేల్చి చెప్పారు. ఈ నెల 12న పాట్నాలో జరగబోయే విపక్షాల సమానవేశానికి కాంగ్రెస్ పార్టీ హాజరు అవుతుందని క్లారిటీ ఇచ్చారు. అయితే పార్టీ తరపున ఈ మీటింగ్‌కు ఎవరెవరు వెళ్తారు అనేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు.

Tags:    

Similar News