పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో విలీనమవుతుందనే విశ్వాసం ఉంది: రాజ్‌నాథ్ సింగ్

పీఓకేలోని ప్రజలే భారత్‌లో కలిసేందుకు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి అది జరుగుతుందనే నమ్మకం ఉందని ఆయన తెలిపారు.

Update: 2024-03-24 14:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో విలీనమవుతుందనే విశ్వాసం తనకుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ప్రజలే భారత్‌లో కలిసేందుకు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి అది జరుగుతుందనే నమ్మకం ఉందని ఆయన తెలిపారు. ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో కశ్మీర్ ప్రజల గురించి పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ ఇదివరకు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రాజ్‌నాథ్ సింగ్, వాళ్లు కశ్మీర్‌ను ఎప్పుడైనా స్వాధీనం చేసుకోగలరా? వారు పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించే ఆందోళన చెందుతున్నారు. కానీ, అది అవసరం లేదని నేను దాదాపు ఏడాదిన్నర క్రితమే చెప్పాను. ఎందుకంటే పీఓకే ప్రజలే భారత్‌లో విలీనం కావాలని డిమాండ్ చేసే పరిస్థితి ఏర్పడుతోంది' అని పేర్కొన్నారు. తాము ఏ దేశంపైన కూడా దాడి చేసే ఆలోచనలో లేము. అయితే, పాక్ ఆక్రమించుకున్న ప్రాంతం మనది. పాక్ ఆక్రమిత కశ్మీర్ మనది, భారత్‌లో పీఓకే స్వయంగా విలీనం అవుతుందని నమ్ముతున్నానని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. 

Tags:    

Similar News