ప్రభుత్వ వివాహ పథకంలోని మేకప్ బాక్స్‌లలో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు

మధ్యప్రదేశ్ ప్రభుత్వం వివాహ పథకంను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఝబువాలో సామూహిక వివాహ వేడుక నిర్వహించి.. నూతన వధూవరులకు వివాహ పథకం కింద ఓ కిట్‌ను అందించారు.

Update: 2023-05-30 09:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం వివాహ పథకంను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఝబువాలో సామూహిక వివాహ వేడుక నిర్వహించి.. నూతన వధూవరులకు వివాహ పథకం కింద ఓ కిట్‌ను అందించారు. అయితే ఆ కిట్‌లోని మేకప్ బాక్స్‌లలో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ కన్యా వివాహ యోజన కింద వివాహ వేడుకను నిర్వహించగా.. ఆ కిట్‌లలో కండోమ్స్, గర్బనిరోధక మాత్రలు చేర్చడాన్ని జిల్లా సీనియర్ అధికారి తీవ్రంగా తప్పుబట్టారు. కొంతమంది అధికారులు నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని అధికారులు చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News