రెండు నెలల్లో సీఎం కుర్చీ నుండి అతడు ఔట్: కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రచార
దిశ, వెబ్‌డెస్క్: ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ సారి బీజేపీ గెలిస్తే అమిత్ షా భారత ప్రధానమంత్రి అవుతారని, వచ్చే ఏడాది మోడీ రిటైర్ అవుతారని షాకింగ్ కామెంట్స్ చేశారు. అమిత్ షాను ప్రధానిని చేయడం కోసమే మోడీ ఈ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు. ఇక, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌ను రెండు నెలల్లో సీఎం పదవి నుండి తొలగిస్తారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. బీజేపీలో అమిత్ షాకు యోగి అడ్డుగా ఉన్నారని.. అందుకే ఆయనను ఇక సైడ్ చేస్తారని కేజ్రీవాల్ కీలక వ్యా్ఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో మరోసారి బీజేపీ గెలిస్తే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుపోతుందని అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీని ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలపై వాళ్లు కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారని ఫైర్ అయ్యారు.