మెక్సికో అధ్యక్షురాలిగా క్లాడియా షీన్ బామ్.. 200 ఏళ్ల చరిత్రలో తొలి మహిళగా రికార్డు
మెక్సికో అధ్యక్షురాలిగా క్లాడియా షీన్ బామ్ ఎన్నికయ్యారు. 200 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ అధ్యక్షపీఠం కైవసం చేసుకున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో : మెక్సికో అధ్యక్షురాలిగా క్లాడియా షీన్ బామ్ ఎన్నికయ్యారు. 200 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ అధ్యక్షపీఠం కైవసం చేసుకున్నారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో క్లాడియా షీన్ బామ్ విక్టరీ సాధించారు. ప్రస్తుత అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపేజ్ ఒబ్రాడర్ స్థానంలో షీనా గెలుపొందారు. అక్టోబర్ 11న అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా షీనాబామ్ గెలుస్తారని.. ఆమెకు 50-60 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశాయి.
లోపేజ్ బాటలోనే..
దేశ ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ పరచనని కొత్తగా ఎన్నికైనా మెక్సికో అధ్యక్షురాలు షీన్బామ్ అన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు లోపేజ్ బాటలోనే నడుస్తానన్నారు. ఆయన ప్రారంభించిన అభివృద్ధి పనులు కొనసాగిస్తానని తెలిపారు. మెక్సికోకు ఓ మహిళ అధ్యక్షురాలిగా గెలుపొందడం మరిచిపోలేని క్షణమని ప్రత్యర్థి గాల్వేజ్ అన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు లోపేజ్ కూడా క్లాడియా షీన్బామ్ను అభినందించారు. తన కంటే ఎక్కువ మెజారిటీతో గెలుపొందడం సంతోషంగా ఉందని తెలిపారు.
క్లాడియా షీన్ బామ్ ఎవరంటే?
1962 జూన్ 24న మెక్సికోలో షీన్ బామ్ జన్మించారు. ఆమె కుటుంబం బల్గేరియా నుంచి మెక్సికోకు వచ్చి స్థిరపడింది. నేషనల్ అటానమస్ యూనివర్శిటీ ఆఫ్ మెక్సికో నుంచి ఎనర్జీ ఇంజనీరింగ్ విభాగంలో పీహెచ్డీ చేశారు. సైంటిస్టుగా కేరీర్ ప్రారంభించిన ఆమె.. కాలిఫోర్నియాలోని ల్యాబ్లో మెక్సికో ఇంధన వినియోగంపై పరిశోధనలు చేశారు. ఆ తర్వాత 2018లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆ సంవత్సరంలో సిటీ మేయర్గా బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో ఆ పదవికి ఎన్నికైన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు.