CISF battalion: సీఐఎస్ఎఫ్‌లో తొలి మహిళా బెటాలియన్‌.. ఆమోదం తెలిపిన కేంద్రం

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో తొలి మహిళా బెటాలియన్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Update: 2024-11-13 15:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో తొలి మహిళా బెటాలియన్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.1025 మంది సిబ్బందితో కూడిన మహిళా బెటాలియన్‌ను ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బెటాలియన్‌కు సీనియర్ కమాండెంట్ స్థాయి అధికారి నేతృత్వం వహించనున్నారు. దేశంలోని కీలకమైన విమానాశ్రయాలు, మెట్రో రైలు వంటి మౌలిక సదుపాయాలకు వీఐపీ భద్రతను కల్పించే బాధ్యతను వీరికి అప్పగించనున్నట్టు తెలుస్తోంది. దేశ నిర్మాణానికి సంబంధించిన ప్రతి రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించాలనే ప్రధాని మోడీ కలలను సాకారం చేసే దిశగా సీఐఎస్‌ఎఫ్‌లో మహిళా బెటాలియన్‌ను ఏర్పాటు చేసినట్టు కేంద్ హోం మంత్రి అమిత్ షా తెలిపారు. మరింత మంది మహిళలు బెటాలియన్‌లో చేరాలని ఆకాంక్షించారు.

కాగా, 1968లో 3,129 మంది సిబ్బందితో ఏర్పాటైన సీఐఎస్‌ఎఫ్ ఈ ఏడాది జూన్ 1 నాటికి 1.77 లక్షల మంది సిబ్బందితో పారామిలటరీ దళంగా ఎదిగింది. వీరిలో 7శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. అయితే మొత్తంగా12 బెటాలియన్లు ఉన్న సీఐఎస్‌ఎఫ్‌లో ఇప్పటి వరకు పూర్తి స్థాయి మహిళా బెటాలియన్ ఒక్కడి కూడా లేదు. వచ్చే ఏడాది నాటికి సీఐఎస్‌ఎఫ్‌కి తొలి మహిళా బెటాలియన్‌ సిద్ధమవుతుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రక్రియ జరుగుతున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. బెటాలియన్ ఎంపిక, శిక్షణ, కార్యాలయ ఏర్పాటుకు సంబంధించిన విషయాలపై దృష్టి సారించినట్టు సమాచారం.

Tags:    

Similar News