మోడీజీ మీ 56 అంగుళాల ఛాతీ ఎక్కడ?- కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ప్రశ్నాస్త్రాలు

ప్రధాని మోడీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. భారత్ లోని భూభాగాలను చైనా ఆక్రమిస్తుంటే ఏం చేశారని మోడీని ప్రశ్నించారు.

Update: 2024-05-25 14:06 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. భారత్ లోని భూభాగాలను చైనా ఆక్రమిస్తుంటే ఏం చేశారని మోడీని ప్రశ్నించారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించినా.. మౌనంగా ఎందుకు ఉన్నారని అడిగారు. హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఖర్గే.. ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హయాంలో పాక్ తో పోరాడి బంగ్లాకు భారత్ స్వాతంత్య్రం తెచ్చిందని గుర్తుచేశారు. కానీ, దేశ భూభాగాలను చైనా ఆక్రమిస్తుంటే.. మోడీ మౌనంగా ఉన్నారని ఆరోపించారు. దేశభూభాగంలో చైనారోడ్లు, ఇళ్ల నిర్మాణాలు చేపట్టిందన్నారు. మోడీజీ మీ 56 అంగుళాల ఛాతీ ఎక్కడ ఉంది? అని ఖర్గే ప్రశ్నించారు. 2023లో హిమాచల్ లో వరదలు బీభత్సం సృష్టించాయని అన్నారు. ఆ టైంలో కేంద్రం నుంచి సాయ కోరినా స్పందించలేదని మండిపడ్డారు. దేశప్రజలను, రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రభుత్వంలోని 30 లక్షల ఖాళీలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.


Similar News