ఛత్తీస్‌గఢ్ కోల్ లెవీ కేసు: కాంగ్రెస్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

కోల్ లెవీ మనీలాండరింగ్ కేసు దర్యాప్తు లో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లోని రాష్ట్ర కాంగ్రెస్ కోశాధికారి రామ్ గోపాల్ అగర్వాల్ ఇంటితో సహా పలు ప్రాంతాల్లో ఆకస్మిక సోదాలను నిర్వహించింది.

Update: 2023-03-28 05:11 GMT

దిశ, వెబ్ డెస్క్: కోల్ లెవీ మనీలాండరింగ్ కేసు దర్యాప్తు లో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లోని రాష్ట్ర కాంగ్రెస్ కోశాధికారి రామ్ గోపాల్ అగర్వాల్ ఇంటితో సహా పలు ప్రాంతాల్లో ఆకస్మిక సోదాలను నిర్వహించింది. సీనియర్ అధికారులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు, మధ్య దళారులతో కూడిన కార్టెల్ తో రాష్ట్రంలో రవాణా చేసే ప్రతి టన్ను బొగ్గుపై రూ.25 అక్రమ పన్ను వసూలు చేశారు. రాయ్‌పూర్ మరియు భిలాయ్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగాయి.

అంతకు ముందు ఫిబ్రవరి 20న ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్ డిప్యూటీ సెక్రటరీ సౌమ్య చౌరాసియా సహా తొమ్మిది మందిని దర్యాప్తు సంస్థ అరెస్టులు కూడా చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఫిబ్రవరి 24 నుంచి రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ నాలుగు రోజుల సుదీర్ఘ ప్లీనరీ సమావేశానికి ముందే ఈడీ దాడులు జరిగాయి. 2021 నుంచి ఈడీ చేపట్టిన సోదాల్లో ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో డబ్బు స్వాధీనం చేసుకుంది.

అదేవిధంగా.. 2021లో ఓ ఏజెన్సీ నుంచి దాదాపు రూ.500 కోట్లను రికవరీ కూడా చేయడం గమనార్హం. అక్టోబర్ 2022లో, ఛత్తీస్‌గఢ్‌లోని టాప్ బ్యూరోక్రాట్స్, రాజకీయ నాయకులు మరియు వ్యాపారవేత్తలకు సంబంధించిన దాదాపు 40 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన దర్యాప్తు సంస్థ రూ.4కోట్ల నగదు, కోట్ల విలువైన విలువైన వస్తువులు మరియు ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకుంది.

Tags:    

Similar News