పాక్ నుంచి ఉగ్రవాదులకు మెసేజ్‌లు.. యాప్‌లపై కేంద్రం నిషేధం

పాక్ లోని ఉగ్రవాద సంస్థలపై భారత్ డిజిటల్ స్ట్రైక్ చేసింది.

Update: 2023-05-01 16:49 GMT

న్యూఢిల్లీ: పాక్ లోని ఉగ్రవాద సంస్థలపై భారత్ డిజిటల్ స్ట్రైక్ చేసింది. పాకిస్తాన్ లోని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు కాశ్మీర్ లోని ఉగ్రవాదులకు మెసేజ్ లు పంపడానికి వాడుతున్న 14 మొబైల్ మెసెంజర్ యాప్ లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రభుత్వం బ్లాక్ చేసిన యాప్‌ల జాబితాలో Crypviser, Enigma, Safeswiss, Wickrme, Mediafire, Briar, BChat, Nandbox, Conion, IMO, Element, Second line, Zangi, Threema మొదలైనవి ఉన్నాయి.

భారతదేశ వ్యతిరేక సందేశాలను, ఉగ్రవాద కార్యకలాపాల ప్రణాళికలను కాశ్మీర్ లోని తమ సపోర్టర్స్ కు పంపడానికి పాక్ ఉగ్రవాద సంస్థలు ఈ యాప్స్ ను వాడుతున్నాయని నిఘా నివేదికలు రావడంతో ఈమేరకు చర్యలు తీసుకుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్ 69A కింద 14 యాప్స్ ను బ్లాక్ చేసింది. గూఢచర్యానికి పాల్పడుతున్నాయనే ఆరోపణతో గత కొన్నేళ్లలో దాదాపు 250 చైనీస్ యాప్‌లను కూడా భారత ప్రభుత్వం నిషేధించింది.

Tags:    

Similar News