Union Minister: అల్లు అర్జున్‌ అరెస్ట్‌ను ఖండించిన సెంట్రల్ మినిస్టర్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌(Allu Arjun) అరెస్ట్‌ను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnaw) ఖండించారు.

Update: 2024-12-13 16:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌(Allu Arjun) అరెస్ట్‌ను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnaw) ఖండించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ అంటే కాంగ్రెస్‌(Congress)కు గౌరవం లేదని విమర్శించారు. అల్లు అర్జున్‌ అరెస్ట్‌తో మరోసారి నిరూపించుకున్నారని అన్నారు. సంధ్య థియేటర్‌(Sandhya Theatre) ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే అని తెలిపారు. తప్పు కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

అంతకుముందు కిషన్ రెడ్డి(Kishan Reddy) కూడా అల్లు అర్జున్ అరెస్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సినీ తారలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. అరెస్ట్ ప్రభుత్వ బాధ్యతారాహిత్యమని, అసమంజసమైనదని విమర్శించారు. ప్రీమియర్ షోకు సంబంధించి నిర్వాహకులు ముందుగానే అధికారులకు సమాచారం ఇచ్చినట్లుగా చెబుతున్నారని, కాబట్టి ఈ అరెస్ట్ ఉద్దేశపూర్వకమేనని అర్థమవుతోందన్నారు. శాంతిభద్రతల అంశం పోలీసులు చూసుకోవాలని, కానీ దానిని పక్కన పెట్టి ఒకరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదన్నారు.

Tags:    

Similar News