ఈడీ స్వాధీనం చేసుకున్న డబ్బుపై కేంద్రం కీలక నిర్ణయం

పార్లమెంట్ ఎన్నికల వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న డబ్బులను దేశంలోని పేదలకు పంచాలని ఫిక్స్ అయింది.

Update: 2024-04-07 10:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న డబ్బులను దేశంలోని పేదలకు పంచాలని ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రకటించారు. ఆదివారం ప్రధాని మాట్లాడుతూ.. వికసిత్ భారత్ బీజేపీతోనే సాధ్యమన్నారు. దేశ వ్యాప్తంగా వేర్వేరు సోదాల్లో ఈడీ అధికారులు రూ.3 వేల కోట్లు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఇదంతా ప్రజల సొమ్మే అని.. వారికి దక్కడమే న్యాయమని చెప్పారు. దేశ ప్రజలంతా మూకుమ్మడిగా బీజేపీ మళ్లీ గెలిపించడానికి సిద్ధమయ్యారని అన్నారు. తప్పకుండా మరోసారి అధికారాన్ని చేపడుతామని దీమా వ్యక్తం చేశారు. సంపూర్ణ మెజార్టీతో విజయం సాధిస్తామని జోస్యం చెప్పారు. గత పదేళ్లలో తన ప్రభుత్వం చేసిన పనులు కేవలం ట్రయలర్ మాత్రమేనని, రానున్న రోజుల్లో మరిన్ని చూస్తారని ప్రధాని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News