మా ప్రభుత్వాలపై కేంద్రం దురుద్దేశం : ఆప్

Update: 2023-12-29 11:56 GMT

న్యూఢిల్లీ : జనవరి 26న జరగనున్న గ‌ణ‌తంత్ర దినోత్సవ ప‌రేడ్ కోసం ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల‌కు చెందిన శ‌క‌టాలను కేంద్ర ప్రభుత్వం తిర‌స్కరించింది. ఈ ప‌రేడ్ సందర్భంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు త‌మ ప్రగ‌తి, సంస్కృతి, సంప్రదాయాలు, చ‌రిత్రను తెలియ‌జేసే విధంగా శ‌క‌టాల‌ను ప్రదర్శిస్తాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందిన శ‌క‌టాల‌కు మాత్రమే పరేడ్‌లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ప్రతి సంవత్సరం కొన్ని రాష్ట్రాల శ‌క‌టాలకు అనుమతులు లభించవు. ఈక్రమంలోనే ఈసారి ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల‌కు పర్మిషన్ దక్కలేదు.

ఈ అంశంపై ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ స్పందిస్తూ.. పంజాబ్, ఢిల్లీలలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాలపై కేంద్రంలోని మోడీ సర్కార్ దురుద్దేశంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తమ ప్రభుత్వాలు ఆరోగ్య, విద్యారంగాల్లో చేసిన పనులు నచ్చకపోవడం వల్లే ఢిల్లీ, పంజాబ్ శకటాలకు పరేడ్‌లో పాల్గొనే ఛాన్స్ ఇవ్వడం లేదని విమర్శలు గుప్పించారు. ఆప్ ప్రభుత్వాలపై కేంద్రం క‌క్షపూరితంగా వ్యవహరిస్తోందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌర‌భ్ భ‌ర‌ద్వాజ్ మండిప‌డ్డారు.


Similar News