CEC Rajiv Kumar: ఈవీఎంల హ్యాకింగ్ అసాధ్యం.. సీఈసీ రాజీవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
ఈవీఎం (EVM)ల హ్యాకింగ్ (Hacking) అసాధ్యమని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ (CEC Rajiv Kumar) అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఈవీఎం (EVM)ల హ్యాకింగ్ (Hacking) అసాధ్యమని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ (CEC Rajiv Kumar) అన్నారు. ఇవాళ ఢిల్లీ (Delhi) అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) సంబంధించి ఆయన షెడ్యూల్‌ను ఇవాళ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈవీఎం (EVM)లను హ్యాకింగ్ చేయడమే సాధ్యం కాని విషయమని అన్నారు. అదేవిధంగా రిగ్గింగ్ (Rigging) చేయడం కూడా వీలు కాదని స్పష్టం చేశారు. ఈవీఎంల ట్యాపరింగ్ జరిగినట్లుగా దేశంలో ఇప్పటి వరకు ఆధారాలు కూడా లేవని అన్నారు. అదేవిధంగా ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమని కోర్టుకు కూడా చెప్పాయని గుర్తు చేశారు. అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని రాజీవ్ కుమార్ అన్నారు.