దూకుడు పెంచిన సీబీఐ.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో రెండో ఛార్జ్ షీట్ దాఖలు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ మంగళవారం రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.

Update: 2023-04-25 12:26 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ మంగళవారం రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. కుంభకోణానికి సంబంధించి దర్యాప్తులోని కీలక అంశాలను ఈ రెండో ఛార్జ్ షీట్‌లో సీబీఐ పొందుపరిచింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లో ఆప్ నేత మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుపై కీలక అభియోగాలను మోపింది. అర్జున్ పాండే, అమన్‌దీప్ సింగ్ ధాల్‌లను నిందితులుగా పేర్కొంది. గత నవంబర్‌లో మొదటి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సీబీఐ.. ఆ తర్వాత మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవితతో సహా పలువురిని ప్రశ్నించింది.

మరో వైపు ఈ కేసులో తన మధ్యంతర బెయిల్ పొడిగించాలని శరత్ చంద్రారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు ఈడీకీ నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరపనుంది. తన భార్య ఆరోగ్యం సరిగా లేదని, కొన్ని ముఖ్యమైన విషయాల్లో చికిత్స తీసుకోవాల్సి ఉందని ఆరు వారాల పాటు బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని శరత్ చంద్ర రెడ్డి కోరడంతో ఈనెల 1న శరత్ చంద్రారెడ్డికి రౌస్ అవెన్యూ కోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇప్పుడు ఆ బెయిల్ గడువు మరి కొంత కాలం పొడిగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Tags:    

Similar News