రోల్స్ రాయిస్‌ కంపెనీపై సీబీఐ కేసు నమోదు

ప్రముఖ కార్ల కంపెనీ రోల్స్ రాయిస్‌పై సీబీఐ కేసు నమోదైంది. భారత ప్రభుత్వాన్ని మోసం చేసిందనే ఆరోపణల నేపథ్యంలో రోల్స్ రాయిస్‌‌‌పై సోమవారం సీబీఐ కేసు నమోదు చేసింది.

Update: 2023-05-29 09:00 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ కార్ల కంపెనీ రోల్స్ రాయిస్‌పై సీబీఐ కేసు నమోదైంది. భారత ప్రభుత్వాన్ని మోసం చేసిందనే ఆరోపణల నేపథ్యంలో రోల్స్ రాయిస్‌‌‌పై సోమవారం సీబీఐ కేసు నమోదు చేసింది. 24 హాక్‌జెట్, 115 అడ్వాన్స్ కొనుగోలులో అవినీతికి పాల్పడిందని సీబీఐ పేర్కొంది. బ్రిటిష్ ఏరోస్పేస్ కంపెనీ రోల్స్ రాయిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, టిమ్ జోన్స్, డైరెక్టర్ రోల్స్ రాయిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ప్రైవేట్ డీలర్స్ సుధీర్ చౌదరి, భాను చౌదరి, పలువురు ప్రభుత్వ ఉద్యోగులపై సీబీఐ కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది. 2003 సెప్టెంబరు 3న జరిగిన రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన సమావేశంలో క్యాబినెట్ కమిటీ, 66 హాక్ 115 విమానాల సేకరణకు భారత్, యూకే ప్రభుత్వాల మధ్య ఒక అంతర్-ప్రభుత్వ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, నిరంతర ఉత్పత్తి కోసం మార్చి 19, 2004న రెండు దేశాల మధ్య అవగాహన ఒప్పందం కూడా కుదిరింది.

ఒప్పందాలలో మధ్యవర్తిత్వం వహించిన రోల్స్ రాయిస్‌, ప్రభుత్వానికి ఎటువంటి సిఫార్సు చేయలేదని, ఒప్పందం కూడా కుదుర్చుకోలేదని సీబీఐ పేర్కొంది. దీంతో భారత్, ఇతర దేశాలలో ప్రాజెక్ట్‌లను భద్రపరచడంలో రోల్స్ రాయిస్ అవినీతి కార్యకలాపాలకు పాల్పడిందన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అంతేకాకుండా రోల్స్ రాయిస్ కంపెనీ పన్ను వ్యవహారాలపై విచారణను అడ్డుకునేందుకు ఇన్కం‌ట్యాక్స్ అధికారులకు కూడా లంచాలు ఇచ్చిందని యూకే ఎన్పీఓ విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా, యుద్ధ విమానాల కొనుగోలు కోసం రష్యాతో రక్షణ ఒప్పందాలకు సంబంధించి సుధీర్ చౌదరితో సంబంధమున్న పోర్ట్స్‌మౌత్ అనే కంపెనీ పేరిట స్విస్ బ్యాంక్ ఖాతాలో రష్యా ఆయుధ కంపెనీలు 100 మిలియన్ల జీబీపీని డిపాజిట్ చేసినట్లు విచారణలో వెల్లడైంది.

Tags:    

Similar News