Bhupesh Baghel: ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం నివాసంలో సీబీఐ సోదాలు

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) మాజీ సీఎం, కాంగ్రెస్‌ నేత భూపేశ్‌ బఘేల్‌ (Bhupesh Baghel) మరో కేసులో ఇరుక్కున్నారు. బెట్టింగ్ యాప్ కేసులో సీబీఐ తనిఖీలు చేపడుతోంది.

Update: 2025-03-26 10:42 GMT
Bhupesh Baghel: ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం నివాసంలో సీబీఐ సోదాలు
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) మాజీ సీఎం, కాంగ్రెస్‌ నేత భూపేశ్‌ బఘేల్‌ (Bhupesh Baghel) మరో కేసులో ఇరుక్కున్నారు. ఇప్పటికే లిక్కర్ స్కాం కేసులో ఆయన ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టగా.. ఇప్పుడు బెట్టింగ్ యాప్ కేసులో సీబీఐ తనిఖీలు చేపడుతోంది. రాయ్‌పుర్‌, భిలాయిలోని ఆయన నివాసాల్లో సీబీఐ అధికారులు తనిఖీలు (CBI Raids) చేస్తున్నారు. బఘేల్‌ (Bhupesh Baghel)కు అత్యంత సన్నిహితుడైన ఓ సీనియర్‌ పోలీసు అధికారి ఇంట్లోనూ ఈ దాడులు జరుగుతున్నాయి. గతేడాది మహాదేవ్ బెట్టింగ్ యాప్ కు సంబంధించి ఛత్తీస్ గఢ్ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో దాఖలైన 70 కేసులను దర్యాప్తు చేయడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీబీఐ అనుమతి ఇచ్చింది. అందులో భాగంగానే ఈ తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ సోదాలపై అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

సోదాలపై స్పందించిన మాజీ సీఎం

మరోవైపు, ఈ సోదాలపై మాజీ సీఎం బఘేల్ స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీ కీలక సమావేశం కోసం తాను ఢిల్లీ వెళ్లబోతున్న సమయంలో సీబీఐ తమ నివాసానికి వచ్చినట్లు తెలిపారు. బీజేపీ కుట్రలో భాగంగానే తనపై ఈ దాడులు చేస్తున్నట్లు దుయ్యబట్టారు. అంతేకాకుండా, ఈ సోదాలపై ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ స్పందించింది. కాంగ్రెస్ నేత ఆనంద్ శుక్లా మాట్లాడుతూ.. "భూపేశ్ బఘేల్ పంజాబ్ పార్టీ ఇన్‌చార్జ్‌గా మారినప్పటి నుండి బీజేపీ భయపడుతోంది. మొదట ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ అధికారులను అతని నివాసానికి పంపారు. ఇప్పుడు సీబీఐని పంపారు. ఇది బీజేపీ భయాన్ని చూపిస్తుంది. కాషాయ పార్టీ రాజకీయంగా పోరాడడంలో విఫలమైనప్పుడు.. తన ప్రత్యర్థులపై కేంద్ర సంస్థలను ఉపయోగిస్తుంది" అని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర, దేశ ప్రజలకు బీజేపీ "అణచివేత" రాజకీయాల గురించి తెలుసునని అన్నారు.

మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాం

రూ.6000 కోట్ల విలువైన ఈ మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌(Mahadev betting app case) కుంభకోణం వ్యవహారంలో ఇప్పటికే బఘేల్‌పై రాష్ట్ర ఆర్థికనేరాల విభాగం కేసు నమోదు చేసింది. 2023లో జరిగిన ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహదేవ్‌ ఈ స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్ల నుంచి మాజీ సీఎంకు రూ.508 కోట్ల ముడుపులు అందాయని ఆరోపణలు వచ్చాయి. యాప్ యజమానిగా ఉన్న శుభమ్ సోనీ నేరాన్ని ఒప్పుకుని.. సీఎంగా ఉన్న సయమంలో బఘేల్ ప్రోత్సహించారని, ఆయనతో ఉన్న సంబంధాల గురించి బయటపెట్టారు. ఆ తర్వాత దీనిపై దర్యాప్తు చేపట్టిన ఈడీ.. ఈ స్కాంతో రాజకీయ నాయకులు, సీనియర్ అధికారుల ప్రమేయం ఉన్నట్లు తేల్చింది.

Tags:    

Similar News