రాహుల్ ఖాళీ చేస్తే తల్లితో ఉంటారు.. నా ఇంట్లోనూ చోటు ఉంది : మల్లిఖార్జున ఖర్గే
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ అధికార బంగ్లా ఖాళీ చేయాలనే నోటీసుల నేపథ్యంలో ఆయన ఎక్కడ ఉంటారనే విషయమై ప్రశ్నలు నెలకొన్నాయి. దీనిపై కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ‘రాహుల్ గాంధీని బలహీనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ ఆయన అధికార నివాసాన్ని వీడితే.. ఆయన తల్లితో పాటు ఉంటారు. లేదా నా వద్దకు వస్తే ఇక్కడ చోటు ఉంది’ అని అన్నారు.
ప్రభుత్వం రాహుల్‌ను భయపెట్టాలనే చర్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. కొన్ని సార్లు బంగ్లా లేకుండా ఉంటామని, తాను ఆరు నెలల తర్వాత అధికార నివాసాన్ని పొందినట్లు గుర్తు చేశారు. కాగా, సోమవారమే రాహుల్‌ను నెల రోజుల్లో అధికార బంగ్లాను ఖాళీ చేయాలని లోక్‌సభ హౌజ్ కమిటీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.