Cabinate: రేపు కేంద్ర కేబినెట్ భేటీ.. ‘జమిలీ’కి ఆమోదం తెలిపే చాన్స్ !
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ గురువారం ఢిల్లీలో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది.
దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) అధ్యక్షతన కేంద్ర కేబినెట్ (Union cabinate) గురువారం ఢిల్లీలో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అలాగే ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశమున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. జమిలీ ఎన్నికలపై సర్వత్రా చర్చ జరుగుతున్న వేళ మంత్రి వర్గా భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశంలో ఎలాటి నిర్ణయాలు తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది. గత నెల 25న మోడీ నేతృత్వంలోని కేబినెట్ పాన్ 2.0కి ఆమోదం తెలిపింది. కనెక్టివిటీకి సంబంధించిన మూడు ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు సైతం ఓకే చెప్పింది. అక్టోబర్ 3న మరాఠీ, పాలీ, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ భాషలకు శాస్త్రీయ హోదా కల్పించింది. అయితే ప్రస్తుతం జరిగే కేబినెట్ మీటింగ్‌లోనూ పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్నట్టు సమాచారం.