46 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు.. ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచిందంటే..?
పార్లమెంట్ ఎన్నికల తర్వాత దేశంలోని మరో రెండు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు.. 13 రాష్ట్రాల్లోని 46 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.
దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ ఎన్నికల తర్వాత దేశంలోని మరో రెండు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు.. 13 రాష్ట్రాల్లోని 46 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఈ రోజు (నవంబర్ 23 శనివారం) వెలువడ్డాయి. కాగా ఈ ఎన్నికల ఫలితాల్లో(Election results) పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్ర(Maharashtra)లో ఎన్డీయే కూటమి(NDA alliance) భారీ విజయం సాధించింది. అలాగే 81 అసెంబ్లీ స్థానాలు ఉన్న జార్ఖండ్ రాష్ట్రంలో ఇండియా కూటమి(Alliance of India) విజయం సాధించింది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు 46 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ తో పాటు ఆయా రాష్ట్రాల్లో.. అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు హవా కొనసాగించాయి. మొత్తం 13 రాష్ట్రాల్లోని 46 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరగ్గా.. పంజాబ్‌లో 3 చోట్ల ఆప్,ఒక స్థానంలో కాంగ్రెస్ గెలిచాయి.
బెంగాల్‌లో ఆరు స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా.. 6 స్థానాల్లో టీఎంసీ(TMC) గెలిచింది. యూపీ(UP)లో 7 చోట్ల బీజేపీ(BJP), రెండు స్థానాల్లో ఎస్పీ(SP) విజయం సాధించాయి. అలాగే రాజస్థాన్‌లో ఆరు స్థానాలను బీజేపీ(BJP) కైవసం చేసుకుంది. మధ్యప్రదేశ్‌లో 2 స్థానాల్లో BJP ఆధిక్యం కొనసాగుతుండగా.. కర్నాటకలో 3 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా అధికార కాంగ్రెస్(Congress) మూడింటిలోనూ విజయం సాధించింది. వీటితో పాటుగా.. బిహార్‌లో రెండుచోట్ల బీజేపీ, ఒక స్థానంలో JDU గెలుపొందాయి. కేరళలో కాంగ్రెస్ 2, సీపీఎం(CMP) 2 స్థానాల్లో విజయం సాధించగా.. అసోంలో బీజేపీ, ఏజీపీ(AGP), యూపీపీ(UPP) తలో స్థానంలో గెలుపొందాయి. కేరళలోని వయనాడు పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ(Priyanka gandhi) భారీ మెజార్టీతో విజయం సాధించారు.