బడ్జెట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లండి.. ఎంపీలకు మోడీ దిశ నిర్దేశం

కేంద్రం తీసుకొచ్చిన బడ్జెట్‌ను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

Update: 2023-02-07 15:21 GMT

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన బడ్జెట్‌ను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి సభ్యుడు తమ నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రజలతో మమేకం కావాలని సూచించారు. అంతే కాకుండా బడ్జెట్‌లో సంక్షేమ కేటాయింపులు గురించి ప్రజలకు చేరవేయాలని తెలిపారు. మంగళవారం పార్టీ పార్లమెంటరీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌సభ ఎలక్షన్స్‌కు ముందు ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ అయినప్పటికీ ఏ ఒక్కరూ కూడా దీనిని ఎన్నికల బడ్జెట్‌గా గట్టిగా చెప్పొద్దని అన్నారు. సమగ్ర అభివృద్ధి, సమాజంలోని ప్రతి వర్గానికి ప్రయోజనం చేకూర్చేలా బడ్జెట్ ఆమోదించామని చెప్పారు.

బీజేపీని వ్యతిరేకించే వారు కూడా బడ్జెట్‌ను స్వాగతించారనే విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. బడ్జెట్‌లోని సంబంధిత అంశాల గురించి పేద, మధ్యతరగతితో సహా తమ నియోజకవర్గాలకు తెలియజేయాలని ఎంపీలను కోరారు. ప్రధాని మోడీ, గుజరాత్ ముఖ్యమంత్రిగా తన ఎన్నికల అనుభవాలను గుర్తు చేసుకున్నారు. పనిని ప్రజలు గుర్తించినప్పుడు, వ్యతిరేకత ఏమీ లేదని చెప్పారని పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా పట్టణ యువతను ఆకర్షించేందుకు క్రీడా సమావేశాలు నిర్వహించాలన్నారని వెల్లడించాయి. ఇప్పటివరకు 20 ప్రాంతాల్లో జీ20 సంబంధిత సమావేశాలు నిర్వహించగా, విదేశీ అతిథులు నిర్వహణను మెచ్చుకున్నారని తెలిపాయి.


Similar News